News

మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వం


కాంగ్రెస్ నేత వీహెచ్‌ మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కార్పొరేట్లకు రూ.50వేల కోట్లు మాఫీ చేసి... రైతులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలను కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ఎందుకు అడగడంలేదని ఆయన ప్రశ్నించారు. నయీం కేసుపై మాట్లాడుతూ ఈ కేసు విచారణ సిట్‌తో సాధ్యం కాదని, నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.